Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సురేఖతో కలిసి అమెరికా వెళ్తున్నా: చిరంజీవి

Chiranjeevi left to USA with his wife Surekha
Advertisement
  • షార్ట్ హాలిడే కోసం అమెరికా వెళ్తున్నానన్న చిరంజీవి
  • తిరిగి వచ్చిన వెంటనే 'విశ్వంభర' షూటింగ్ లో పాల్గొంటానని ట్వీట్
  • ఫ్లైట్ లో వెళ్తున్న ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్
Advertisement
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం 'విశ్వంభర' షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన రెండు వారాల పాటు షూటింగ్ లో బిజీగా గడిపారు. తాజాగా షూటింగ్ కు ఆయన చిన్న బ్రేక్ ఇచ్చారు. తన భార్య సురేఖతో కలిసి ఆయన హాలిడే ట్రిప్ కు అమెరికాకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు. 

తన అర్ధాంగి సురేఖతో కలిసి షార్ట్ హాలిడే కోసం అమెరికాకు వెళ్తున్నానని చిరు చెప్పారు. యూఎస్ నుంచి వచ్చిన వెంటనే 'విశ్వంభర' షూటింగ్ లో పాల్గొంటానని తెలిపారు. అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఫ్లైట్ లో వెళ్తున్న ఫొటోను షేర్ చేశారు.
Advertisement
Advertisement
Chiranjeevi
Tollywood
USA

More Telugu News